Tuesday, March 4, 2025
Homeఆంధ్రప్రదేశ్APPSC Jobs: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త

APPSC Jobs: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త

ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీపీఎస్సీ(APPSC) ద్వారా రిక్రూట్‌మెంట్‌ అయ్యే ఉద్యోగుల వయోపరిమితి భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. యూనిఫాం సర్వీసెస్‌ ర్రికూట్‌మెంట్‌లో రెండేళ్ల వయోపరిమితిని పెంచగా.. నాన్‌ యూనిఫాం ఉద్యోగాలకు 34 ఏళ్ల నుంచి ఏకంగా 42 ఏళ్లకు పెంచింది. అయితే ఈ ఏడాది సెప్టెంబర్‌ 30వ తేదీ లోపు జరిగే పరీక్షలకు ఈ వయోపరిమితి పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది.

- Advertisement -

అనంతరం జరిగే నియమాకాలకు పూర్వపు వయోపరిమితి వర్తించనుంది. కాగా త్వరలోనే ఏపీలో మెగా డీఎస్సీతోపాటు పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్దిరోజుల్లోనే ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News