Monday, January 13, 2025
Homeఆంధ్రప్రదేశ్Sankranti Holidays: కనుమ రోజూ సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు

Sankranti Holidays: కనుమ రోజూ సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు

సంక్రాంతి సెలవుల్లో(Sankranti Holidays) మరో రోజును పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కనుమ రోజు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు దొరకనుంది. కాగా గతంలో ప్రకటించిన ప్రభుత్వ సెలవుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులకు జనవరి 14వ తేదీన మాత్రమే సెలవుగా ప్రకటించారు. అయితే దీనిపై యునైటెడ్‌ ఫోరం ఫర్‌ బ్యాంక్ యూనియన్స్‌- ఏపీ స్టేట్ యూనిట్‌ 15వ తేదీన కూడా సెలవుగా ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 6న జారీ చేసిన జీవో నంబర్ 2116కు సవరణలు చేస్తూ కొత్త జీవో విడుదల చేశారు.

- Advertisement -

ఇదిలా ఉంటే సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యార్థులకు పది రోజులపాటు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. జనవరి 10 నుంచి 19 వరకు సెలవులు ప్రకటించగా.. జనవరి 20న తిరిగి స్కూళ్లు ప్రారంభం కానున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News