జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిలో(Pahalgam Terror Attack) మరణించిన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం(AP Government) ఆర్థిక సాయం ప్రకటించింది. ఉగ్రవాదుల దాడిలో విశాఖపట్నానికి చెందిన జె.డి. చంద్రమౌళి, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఐటి ఉద్యోగి మధుసూదన్ రావు మృతి చెందిన సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి విశాఖ చేరుకున్న చంద్రమౌళి భాతికకాయానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. గురువారం ఉదయం మధుసూదన్ రావు మృతదేహం కావలి చేరుకుంది.
ఈ నేపథ్యంలో వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు సీఎం చంద్రబాబు(Chandrababu). ఈ సందర్భంగా బాధిత కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. ఇక జమ్మూకశ్మీర్ ప్రభుత్వం కూడా మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ.10లక్షలు.. అలాగే గాయపడిన వారికి రూ.2లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.