Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: ప్రభుత్వ పుస్తకం ఆవిష్కరించిన జగన్

AP: ప్రభుత్వ పుస్తకం ఆవిష్కరించిన జగన్

మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ 2023 నేపథ్యంలో ఏపీ టూరిజం, హ్యండీక్రాఫ్ట్స్, టెంపుల్స్, బీచ్‌లు, సోల్స్‌ స్పేస్, ఏ టూ జెడ్‌ టేబుల్‌ గైడ్‌పై ప్రత్యేక పుస్తకాలను ప్రచురించిందిఏపీ ప్రభుత్వం.
ఇంగ్లీష్, జర్మన్, స్పానిష్, చైనీస్‌ బాషల్లో పుస్తకాలు, ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌లు, వివిధ దేశాల రాయబార కార్యాలయాలు, టూరిజం సెంటర్స్‌లో ఏపీ ప్రత్యేకతలు వివరిస్తూ పుస్తకాలు, ఏపీలో టూరిజం, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణంపై ఈ పుస్తకాలలో ప్రత్యేక కథనాలున్నాయి.
బెస్ట్‌ టూరిజం పాలసీ అవార్డును కైవసం చేసుకున్న ఏపీ ప్రభుత్వ టూరిజం శాఖ, ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ టూరిజం పాలసీని అధ్యయనం చేస్తున్నాయని ముఖ్యమంత్రి దృష్టికి ఆ శాఖ అధికారులు తీసుకొచ్చారు. రానున్న రోజుల్లో టూరిజం డెస్టినేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నెంబర్‌ వన్‌ గా ఉన్న రాష్ట్రాన్ని అన్ని రంగాలలోనూ అభివృద్ది పథంలో నడిపిస్తూ, పెట్టుబడులకు స్వర్గధామంగా తీర్చిదిద్దేలా ముందుకు సాగాలంటూ ముఖ్యమంత్రి ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News