Thursday, March 12, 2026
Homeఆంధ్రప్రదేశ్Maha Shivratri: ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. శివరాత్రి హాలీడేపై ప్రభుత్వం క్లారిటీ.!

Maha Shivratri: ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. శివరాత్రి హాలీడేపై ప్రభుత్వం క్లారిటీ.!

Maha Shivratri: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఫిబ్రవరి 16(సోమవారం) ఆప్షనల్‌ హాలీడేగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/karimnagar-news/karimnagar-corporation-bjp-got-35-divisions-reached-magic-figure/

మహా శివరాత్రి ఈ ఏడాది ఫిబ్రవరి 15 ఆదివారం వచ్చిన విషయం తెలిసిందే. రేపు శివరాత్రి జాగారంలో భక్తులు ఉండటంతో మరుసటి రోజు ఆప్షనల్‌ హాలీడేగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు తీపి కబురు అందించింది. ఈ మేరకు ఈ నెల 16న ఆప్షనల్‌ హాలీడేగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్‌ అధికారికంగా నోటిఫికేషన్‌ విడుదల చేశారు. మహాశివరాత్రి జాగారం అనంతరం ఉద్యోగులు విశ్రాంతి తీసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 

Also Read: https://teluguprabha.net/telangana/congress-strategy-meet-on-telangana-hung-municipalities/

ఆప్షనల్‌ హాలీడే పట్ల ఏపీ జేఏసీ అమరావతి నేతలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో పండుగను ప్రశాంతంగా జరుపుకొనేందుకు ఉద్యోగులకు అవకాశం దొరుకుతుందని వెల్లడించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News