Andhra Pradesh Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో పని చేసే సిబ్బందికి సంబంధించిన హోదాలో మార్పు చేసింది. తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రస్తుతం జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పేరుతో ఉన్న పోస్టును ఇకపై జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ గా పిలవాలని నిర్ణయించింది. ఈ మార్పు అధికారికంగా అమల్లోకి రానుంది.
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్…
ప్రస్తుతం జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ హోదాలో పని చేస్తున్న ఉద్యోగులు ఇకపై జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ గా పరిగణించనున్నారు. కొత్త నిర్ణయం వల్ల వారి ఉద్యోగ వివరణలు మరియు బాధ్యతలలో మార్పులు చోటుచేసుకుంటాయి. శాఖలో పని విభజన మరింత స్పష్టంగా ఉండేలా ఈ మార్పు చేయబడినట్టు అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి.
Also Read:https://teluguprabha.net/andhra-pradesh-news/president-murmu-to-review-warships-at-ifr-2026-vizag/
రెవెన్యూ శాఖలో పనితీరును..
రెవెన్యూ శాఖలో పనితీరును సులభతరం చేయడం, విధుల విషయంలో గందరగోళాన్ని తగ్గించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగుల పనిభారం సరైన విధంగా పంచుకోవడం ద్వారా శాఖ పనులు వేగవంతంగా సాగుతాయని అధికారులు భావిస్తున్నారు.
గత ఏడాది డిసెంబరు 10న జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ హోదాను జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ గా మార్చాలని రెవెన్యూ శాఖ ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపింది. ఆ ప్రతిపాదనలపై ఆమోదం లభించడంతో ఈ మార్పు అమలు దిశగా ముందడుగు పడింది. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ హోదాను జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ గా మార్చుతూ జీవో 8లో సవరణ చేశారు. ఈ హోదా మార్పుకు సంబంధించి రెవెన్యూ శాఖ నుంచి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి.
సీనియారిటీ జాబితాల విడుదల..
ఇక మరోవైపు రాష్ట్రంలో ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాల విడుదలకు షెడ్యూల్ ప్రకటించారు. మొదటి విడత జాబితాలు ఈ నెల 25న విడుదల చేయనున్నారు. ఉమ్మడి జిల్లాల ఆధారంగా ఈ జాబితాలను సిద్ధం చేస్తున్నారు. జాబితాలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వాటిని తెలియజేసే అవకాశం ఉంటుంది. అందిన అభ్యంతరాలను పరిశీలించి మార్చి 3న రెండో విడత జాబితా విడుదల చేస్తారు. మార్చి 15న మూడో విడత, మార్చి 30న నాలుగో విడత జాబితాలను ప్రకటించనున్నారు. వేసవి సెలవుల సమయంలో ఈ సీనియారిటీ ఆధారంగా ఉపాధ్యాయుల బదిలీలు చేపడతారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/andhra-pradesh-assembly-resumes-budget-discussion/
డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ …
అదే సమయంలో ఏపీపీఎస్సీ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 38 ఖాళీలకు ఫలితాలు ప్రకటించారు. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 24న నిర్వహించనున్నారు. అలాగే పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులకు మిగిలిన సబ్జెక్టుల తుది ఫలితాలను కూడా ఏపీపీఎస్సీ ప్రకటించింది.

