Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్IAS transfers | IAS లను బదిలీ చేసిన ఏపీ సర్కార్

IAS transfers | IAS లను బదిలీ చేసిన ఏపీ సర్కార్

IAS transfers : ఏపీ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ (IAS) లను బదిలీ చేసింది. ఆదివారం బదిలీలకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థిక శాఖ కార్యదర్శిగా రోనాల్డ్ రాస్ నియమితులయ్యారు. మున్సిపల్, పట్టణ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా కే కన్నబాబుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండిగా బి. అనిల్ కుమార్ రెడ్డికి బాధ్యతలు ఇచ్చారు. కార్మిక కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు, ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్ అదనపు కార్యదర్శిగా గంధం చంద్రుడు నియమితులయ్యారు. వ్యవసాయ, సహకార శాఖ డిప్యూటీ సెక్రటరీగా డి. హరితను ఏపీ ప్రభుత్వం నియమించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad