Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్AP HC: న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ కు ఘనంగా వీడ్కోలు

AP HC: న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ కు ఘనంగా వీడ్కోలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి కొంత కాలం పాటు ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి తదుపరి న్యాయమూర్తిగా సేవలందించి పదవీ విరమణ చేసిన జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ కు రాష్ట్ర హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. రాష్ట్ర హైకోర్టు మొదటి కోర్టు హాల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని పుల్ కోర్టు ఆధ్వర్యంలో జస్టిస్ ప్రవీణ్ కుమార్ కు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది.ఈవీడ్కోలు కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇక్కడ ఏర్పాటైనపుడు భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పనలో ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ మెరుగైన కృషి చేశారని కొనియాడారు.

- Advertisement -

జస్టిస్ ప్రవీణ్ కుమార్ న్యాయమూర్తిగా సుమారు 26 వేల కేసులను పరిష్కరించి ఎనలేని సేవలందించారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా ప్రత్యేకంగా కొనియాడారు. జస్టిస్ ప్రవీణ్ కుమార్ యువ న్యాయవాదులకు ఆదర్శప్రాయుడని, ఆయన వ్యక్తిత్వం పూర్తిగా విశ్వాసం,కరుణతో నిండి ఉందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News