ఇద్దరు అదనపు జడ్జిలతో ప్రమాణం చేయించిన సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో కొత్తగా నియమితులైన ఇద్దరు అదనపు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ, జస్టిస్ డా.యడవల్లి లక్ష్మణరావుతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. అదనపు న్యాయమూర్తులుగా వీరిరువు శుక్రవారం బాధ్యలు చేపట్టడంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30 కి చేరింది.
వీరిరువురిని పదోన్నతిపై హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కోరుతూ కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం కేంద్రానికి సిపార్సు చేసిన విషయం తెలిసిందే. ఈ సిఫార్సు మేరకు వీరిరువురిని అదనపు న్యాయమూర్తులుగా నియమించేందుకు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఈ నెల 22 వ తేదీ బుధవారం ఆమోద ముద్రవేయడం జరిగింది.
హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షులు ద్వారకానాధ్ రెడ్డి, హైకోర్టు న్యాయ వాదుల సంఘం అధ్యక్షులు కె.చిదంబరం, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పి.పొన్నారావు, హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్ డా.వై.లక్ష్మణరావు, పలువులు రిజిష్ట్రార్లు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.