Saturday, September 21, 2024
Homeఆంధ్రప్రదేశ్నెల్లూరు కోర్టులో ఫైళ్ల మాయం కేసు : రాష్ట్ర హైకోర్టు సంచలన నిర్ణయం

నెల్లూరు కోర్టులో ఫైళ్ల మాయం కేసు : రాష్ట్ర హైకోర్టు సంచలన నిర్ణయం

నెల్లూరు కోర్టులో ఫైళ్ల మాయం కేసుపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు.. సంచలన నిర్ణయం తీసుకుంది. కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు తెలిపింది. ఇకపై ఈ కేసును సీబీఐ విచారిస్తుందని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నెల్లూరు కోర్టు సముదాయంలోని 4వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఏప్రిల్ 13న అర్థరాత్రి వేళ దొంగలు పడ్డారు. ఓ కేసుకు సంబంధించిన కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లారు. కోర్టులో చోరీ జరిగినట్టు మర్నాడు ఉదయం సిబ్బంది గుర్తించి.. స్థానిక చిన్న బజారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

- Advertisement -

ఆ కేసు హైకోర్టుకు రావడంతో.. తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఓ ప్రజాప్రతినిధి కేసుకు సంబంధించిన పత్రాలు, స్టాంపులు, ఇతర పరికరాల చోరీ అప్పట్లో సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చోరీ చర్చనీయాంశంగా మారింది. అధికార, ప్రతిపక్షాల మధ్య చిచ్చు రేపింది. సీబీఐ విచారణలో ఎవరు దొంగలో తెలుస్తుందో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News