ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ఏ2గా ఉన్న సీఐడీ మాజీ చీఫ్ సీతారామాంజనేయులను(PSR anjaneyulu) ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కుక్కల విద్యాసాగర్‌ను అరెస్టు చేశారని.. మిగిలిన నిందితులైన ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్‌గున్నీ, న్యాయవాది, ఏసీపీ, సీఐ.. ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారని తెలిపారు. దీంతో వీరికి అరెస్టు నుంచి వారికి హైకోర్టు రక్షణ కల్పించిందన్నారు. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయని ఉన్న సీతారామాంజనేయులను అరెస్టు చేయకుండా ఎందుకు ఉన్నారని న్యాయమూర్తి అడిగారు. కాగా ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐపీఎస్ అధికారులు పీఎస్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీని ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.