Friday, April 4, 2025
Homeఆంధ్రప్రదేశ్AP: ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయంతో అధికారులను అభినందించిన సీఎం

AP: ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయంతో అధికారులను అభినందించిన సీఎం

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ విజయవంతంగా నిర్వహించడంతో సంబంధిత శాఖల మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులను అభినందించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్, రెండు రోజుల్లో రూ. 13.41 లక్షల కోట్ల పెట్టుబడులు, 378 ఒప్పందాలు, 6.09 లక్షల మందికి ఉపాధి ఎంవోయూలు అమలు దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీని ఏర్పాటుచేసింది.
కమిటీ ప్రతివారం సమావేశమై సదస్సులో కుదిరిన ఎంవోయూల అమలు దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రులు, అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి.
సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్నారు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమర్‌నాథ్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్‌ వలవెన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ డా.జి. సృజన, ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌ ఎండీ ఎస్‌.షన్‌మోహన్‌.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News