ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా శోభకృత్ నామ ఉగాది వేడుకలు సాగాయి. తిరుమల దేవాలయం నమూనాలో ఉగాది వేడుకలు సాగటం విశేషం. పూలు, పళ్లతో వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయించారు చెవిరెడ్డి. పల్లె సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఉగాది వేడుకల ప్రాంగణం అలంకరణ ఉండటంతో ఆహుతులు ఆశ్చర్యపోయారు.
ఉగాది వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి వైయస్ జగన్, భారతి దంపతులు పంచాంగ శ్రవణం, పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంప్రదాయ పంచకట్టులో ఉగాది వేడుకలకు హాజరయ్యారు ముఖ్యమంత్రి.
ఉగాది వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి దంపతులకు ఆహ్వానం పలికిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి వై శ్రీలక్ష్మి, సాంస్కృతిక పర్యాటకశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, దేవాదాయశాఖ కార్యదర్శి హరిజవహర్‌లాల్ ఇతర అధికారులు ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం ఆస్వాదించారు.
పంచాంగాన్ని చదివి వినిపించిన పంచాంగకర్త శ్రీ కప్పగంటి సుబ్బరాయ సోమయాజులు, అనంతరం ఉగాది పచ్చడిని స్వీకరించారు ముఖ్యమంత్రి దంపతులు. వ్యవసాయ పంచాంగం 2023–24ను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి.