Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: మార్చి, ఏప్రిల్లో ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు తేదీలు

AP: మార్చి, ఏప్రిల్లో ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు తేదీలు

సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, మార్చి, ఏప్రిల్‌ నెలలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, అమలు చేయాల్సిన పథకాల తేదీలను ఈ భేటీలో చర్చించి ఖరారు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా రాష్ట్రంలో పలు కార్యక్రమాల అమలు ఆగిపోయింది. ఎన్నికల కోడ్‌ ముగియనుండడంతో కార్యక్రమాలు, పథకాల అమలుకు ప్రభుత్వం సన్నాహాలు మొదలు పెట్టింది. ఎన్నికల కోడ్‌తో సంబంధం లేని కారణంగా మార్చి 10నుంచి మధ్యాహ్న భోజనంతో పాటుగా రాగిజావ అమలు ప్రారంభం కానుంది.
మార్చి 14 నుంచి అసెంబ్లీలో సమావేశాల నిర్వహణకు నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈమేరకు బీఏసీ సమావేశంలో సమావేశాల షెడ్యూలు ఖరారు చేశారు.

- Advertisement -

మార్చి 18 సంపూర్ణ ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకం, జగనన్న విద్యా దీవెన లబ్ధిదారుల ఖాతాల్లోకి డీబీటి పద్ధతిలో నగదు జమ.
మార్చి 22న ఉగాది రోజున ఉత్తమ సేవలందించిన వాలంటీర్ల పేర్ల ప్రకటన. వీరికి ఏప్రిల్‌ 10న అవార్డులు, రివార్డులు.
మార్చి 23న జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభం.
మార్చి 25 నుంచి వైయస్సార్‌ ఆసరా. ఏప్రిల్‌ 5 వరకూ కొనసాగనున్న కార్యక్రమం.
మార్చి 31న జగనన్న వసతి దీవెన.
ఏప్రిల్‌ 6న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ అమలు.
ఏప్రిల్‌ 10న వాలంటీర్లకు సన్మానం.
ఏప్రిల్‌ 18న ఈబీసీ నేస్తం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News