Sunday, April 13, 2025
Homeఆంధ్రప్రదేశ్AP: అమలాపురం ఘటనలపై జగన్ భేటీ

AP: అమలాపురం ఘటనలపై జగన్ భేటీ

అమలాపురం ఘటనల కారణంగా సామాజిక విభేదాల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా క్యాంపు కార్యాలయంలో కోనసీమ నేతలు, సామాజికవర్గాల నాయకులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ హాజరయ్యారు.

- Advertisement -

అమలాపురం ఘటనల కారణంగా సామాజిక విభేదాల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు జోరుగా చేపట్టింది.  వివిధ సామాజిక వర్గాలు మధ్య శాంతి, సామరస్యపూర్వక వాతావరణాన్ని బలపరిచే దిశగా ముఖ్యమంత్రి చొరవ తీసుకున్నారు.  ఈమేరకు క్యాంపు కార్యాలయంలో కోనసీమ నేతలు, సామాజికవర్గాల నాయకులతో సీఎం సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.  అమలాపురం ఘటనలో నమోదైన కేసులు ఉపసంహరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై కోనసీమ నాయకులు హర్షం వ్యక్తంచేశారు.  ఈసందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News