Homeఆంధ్రప్రదేశ్Nadendla Manoharతక్కువ ధరకే క్వాలిటీ బియ్యం..సబ్సిడీ విక్రయాలు

Nadendla Manoharతక్కువ ధరకే క్వాలిటీ బియ్యం..సబ్సిడీ విక్రయాలు

Andhra Pradesh: ఏపీలో పెరుగుతున్న నిత్యావసర ధరలను అదుపులోకితీసుకుని వచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు మొదలు పెట్టింది.అందులో భాగంగా వినియోగదారులకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే అందిస్తున్నట్లు ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు.

- Advertisement -

రూ. 52 కే సన్నబియ్యం..

రూ. 52 కే సన్నబియ్యం అందించే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఆటోనగర్‌లోని ఏపీఐఐసీ రైతు బజార్‌లో సబ్సిడీ బియ్యం విక్రయాలను మంత్రి నాదెండ్ల ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 150 రైతు బజార్లు, 500 రైస్ మిల్లింగ్ అవుట్‌లెట్ల ద్వారా ఈ సబ్సిడీ బియ్యం విక్రయాలు ఆదివారం నుంచే అందుబాటులోకి వచ్చాయని ఆయన పేర్కొన్నారు.

బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు కిలోకు దాదాపు రూ. 10 వరకు పెరగడంతో ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలులోకి తీసుకుని వచ్చింది.

దేశంలోనే అత్యంత తక్కువ ధరకు అత్యుత్తమ నాణ్యత కలిగిన బియ్యాన్ని అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. బియ్యంతో పాటు కందిపప్పు, పామాయిల్ వంటి నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై కూడా పౌర సరఫరాల శాఖ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మంత్రి నాదెండ్ల వివరించారు.

Also Read:Holidays: విద్యార్థులకు అదిరిపోయే న్యూస్‌..ఆగస్టులో సెలవులే..సెలవులు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News