Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్AP Arogya Sri: ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచిత వైద్యం, కొత్త...

AP Arogya Sri: ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచిత వైద్యం, కొత్త ఫీచర్లతో స్మార్ట్‌ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ

క్యాంప్‌ కార్యాలయంలో ప్రారంభించిన సీఎం జగన్‌

డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యం, కొత్త ఫీచర్లతో స్మార్ట్‌ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేపట్టింది జగన్ సర్కారు. ఈమేరకు సీఎం క్యాంప్‌ కార్యాలయంలో స్మార్ట్ కార్డుల పంపిణీని ప్రారంభించారు సీఎం వైఎస్‌ జగన్‌.

- Advertisement -

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడిన వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఏమన్నారంటే…ఆమె మాటల్లోనే

విడదల రజిని, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి

అందరికీ నమస్కారం, ప్రజలంతా మంచి ఆరోగ్యంగా ఉండాలన్న గొప్ప ఆలోచనతో మన రాష్ట్రంలోని అందరికీ అత్యున్నత స్ధాయి నాణ్యమైన వైద్యం ఉచితంగా అందాలనే తలంపుతో నిరంతరం వినూత్న సంస్కరణలు, వినూత్న మార్పులు తీసుకొస్తున్న సీఎంగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ఆరోగ్యశ్రీ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించబోతున్న సీఎంగారు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతారు, నాడు వైఎస్సార్‌ గారు ఈ పథకానికి ప్రాణం పోస్తే నేడు మన సీఎంగారు మరింత విస్తరించారు. దేశ చరిత్రలోనే మొదటిసారి జగనన్న ప్రభుత్వం 53 వేలకు పైగా నియామకాలు చేసిన ఘనత దక్కింది. ప్రతి పార్లమెంట్‌ పరిధిలో గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజ్, ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ భరోసా, ప్రతి గుమ్మానికి ఫ్యామిలీ డాక్టర్, ప్రతి పల్లెకు జగనన్న ఆరోగ్య సురక్ష, కొంతమందికి ఇవి కనిపించడం లేదు, వారికి కూడా డాక్టర్‌ వైఎస్సార్‌ కంటి వెలుగు ఉంది, సీఎంగారు చేస్తున్న ఈ యజ్ఞాన్ని మనమంతా ముందుకు తీసుకువెళదాం, వైద్యులు వైద్యంలో మిరాకిల్స్‌ చేస్తారని వింటుంటాం, కానీ మన జగనన్న వైద్య ఆరోగ్యరంగంలో మిరాకిల్స్‌ చేస్తూ ముందుకెళుతున్నారు, సీఎంగారు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారు. ధ్యాంక్యూ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad