Liquor Scam: ఏపీలో మద్యం కుంభకోణం కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే నిందితులుగా ఉన్న చెవిరెడ్డి, వెంకటేష్ కస్టడీ పిటిషన్‌పై కోర్టు విచారించింది. విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో మద్యం కేసుకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడుల కస్టడీపై విచారణ జరిగింది. ఈ కేసులో సిట్ (SIT) తరఫున న్యాయవాది, ఇద్దరు నిందితులను ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీలోకి అప్పగించాల్సిందిగా కోర్టును అభ్యర్థించారు.
ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి, తుదితీర్పును ఈ నెల 30న వెల్లడిస్తామని తెలిపారు. ప్రస్తుతం భాస్కర్ రెడ్డి (ఏ38), వెంకటేశ్ నాయుడు (ఏ34) ఇద్దరూ విజయవాడ జిల్లా జైల్లో న్యాయపరమైన రిమాండ్‌లో ఉన్నారు.
కేసు వివరాల్లోకి వెళితే, గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో ఓటర్లకు మద్యం కుంభకోణం ద్వారా సమకూరిన నగదును పంపిణీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ డబ్బును కొంతమంది ప్రజాప్రతినిధులకూ అందించారని, నిందితులపై విచారణ జరిపి నగదు ఎవరెవరి ఆదేశాల మేరకు పంపిణీ చేసారో, మొత్తం ఎంత మొత్తాన్ని పంపారో వెల్లడించాల్సిన అవసరం ఉందని సిట్ తరఫు న్యాయవాది వాదించారు. ఈ కారణంగా వారిని విచారణ కోసం కస్టడీకి ఇవ్వాలని కోరారు.
అటు తెలంగాణలో సైతం మద్యం కుంభకోసం కేసు సంచలనాలు సృష్టించింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, BRS ఎమ్మెల్సీ కవితం సైతం అరెస్ట్ కావడంతో పాటు జైలులో కొన్ని నెలలు ఉన్నారు. అయితే ఏపీలో ఈ కేసులో ఇప్పుడిపుడే SIT పట్టు బిగిస్తూ ఒక్కొక్కరిని విచారిస్తుంది. ఈ కేసులో కోర్టు చెవిరెడ్డి, వెంకటేష్‌లకు కోర్టు కస్టడీకి ఇస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.