ఏపీ లిక్కర్ స్కామ్(AP Liquor Scam) కేసులో సిట్ అధికారులు వేగం పెంచారు. ఈ కేసుకు సంబంధించి మరో నలుగురికి నోటీసులు అందించారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ, రోహిత్ రెడ్డికి నోటీసులు పంపించారు. ఆదివారం ఉదయం విజయవాలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ కేసులో ఇప్పటికే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆయన పీఏ చాణక్య, దిలీప్ తదితరులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఈకేసులో ఈడీ ఎంటర్ అయింది. మనీ లాండరింగ్ ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వివరాలు అందజేయాలని సిట్ అధికారులకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఓవైపు సిట్ నోటీసులు, అరెస్టులు.. మరోవైపు ఈడీ ఎంటర్‌తో వైసీపీ నేతల్లో కలవరం మొదలైంది.