ఆస్పత్రిలో బీపీ, ఈసీజీ, షుగర్ తదితర పరీక్షలను వైద్యులు నిర్వహించారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని చెప్పడంతో అధికారులు ఏసీబీ కోర్టుకు తరలించారు. మిథున్ రెడ్డికి రిమాండ్ విధించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం కోర్టును కోరనుంది.
అయితే ఈ లిక్కర్ పాలసీ రూపకల్పనలో అప్పటి ప్రభుత్వంలో ఎంపీ మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని సిట్ తేల్చిచెప్పింది. శనివారం సుమారు 8 గంటల పాటు విచారించిన సిట్ అధికారులు వెంటనే అరెస్టు చేశారు.
అయితే ఈ లిక్కర్ పాలసీ రూపకల్పనలో అప్పటి ప్రభుత్వంలో ఎంపీ మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని సిట్ తేల్చిచెప్పింది. శనివారం సుమారు 8 గంటల పాటు విచారించిన సిట్ అధికారులు వెంటనే అరెస్టు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు అయ్యారు. విచారణకు పిలిచిన సిట్ అధికారులు వెంటనే నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం గెలిచాక.. లిక్కర్ స్కామ్‌పై దర్యాప్తు కాగా.. పలువురిని అరెస్టు చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం. అయితే ఈ కేసులో A4గా ఉన్న మిథున్ రెడ్డి అరెస్టుతో కీలక మలుపు తిరిగింది. ఇతనితో పాటు ఈ స్కామ్‌లో ఎంతో మంది పెద్దపెద్ద నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం పాలసీ రూపకల్పనలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కీలకపాత్ర పోషించినట్టు కేసు విచారణలో తేలింది.
ఎంపీ మిథున్ రెడ్డి నేడు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించిన సిట్.. మరింత సమాచారం కోసం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే అతని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.


