Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్DSC Results: మెగా డీఎస్సీ ఫలితాలు విడుదల

DSC Results: మెగా డీఎస్సీ ఫలితాలు విడుదల

DSC Results: ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన మెగా డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన తుది ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. ఈ విషయాన్ని మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి. కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలియజేశారు. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్‌లోకి వెళ్లి స్కోర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

- Advertisement -

ఫలితాలను ఎలా పొందాలి?

ముందుగా అభ్యర్థులు డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

‘క్యాండిడేట్ లాగిన్‌’ సెక్షన్‌లోకి వెళ్లిన తర్వాత హాల్‌టికెట్ నంబర్ మరియు పాస్‌వర్డ్ నమోదు చేయాలి.

లాగిన్ అయిన తర్వాత ‘సర్వీసెస్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది.

అక్కడ నుంచి ‘AP DSC Results’ అనే ఎంపికను సెలక్ట్ చేస్తే, అభ్యర్థి స్కోర్‌కార్డు డౌన్‌లోడ్‌కు అందుబాటులో ఉంటుంది.

స్కోర్ కార్డులో మొత్తం రాసిన పేపర్లు, వాటిలో పొందిన మార్కులు, టెట్ మార్కులు, మరియు అభ్యర్థి అర్హత (Qualified/Not Qualified) వంటి వివరాలు స్పష్టంగా చూపిస్తారు.

పరీక్ష వివరాలు

ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ ప్రక్రియకు మొత్తం 3.36 లక్షల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలు జూన్ 6 నుండి జూలై 2 వరకు రెండు సెషన్లలో, మొత్తం 23 రోజులపాటు నిర్వహించబడ్డాయి. ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. హాజరైన అభ్యర్థుల శాతం కూడా గణనీయంగా ఉండగా, 92.90% మంది పరీక్షకు హాజరయ్యారని అధికారులు వెల్లడించారు.

తుది కీ ఆధారంగా ఫలితాలు

అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం సవరణలతో కూడిన తుది కీ ఆధారంగా ఫలితాలను విడుదల చేశారు. మార్కుల నార్మలైజేషన్ ప్రక్రియను అనుసరించి తుది స్కోర్‌లు సిద్ధం చేసినట్లు కన్వీనర్ పేర్కొన్నారు.

టెట్ వివరాల్లో సవరణకు అవకాశం

అభ్యర్థుల టెట్ సంబంధిత సమాచారం లోపమై ఉంటే, దాన్ని సరిచేసుకునేందుకు వెబ్‌సైట్‌లో ప్రత్యేక అవకాశాన్ని కల్పించారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేసి అవసరమైన సవరణలు చేసుకోవచ్చు. అయితే, ఈ సౌకర్యం 2025 ఆగస్టు 13 వరకే అందుబాటులో ఉంటుంది. ఈ ఫలితాలను, స్కోర్ కార్డులను అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలపై ఎటువంటి సందేహాలు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించవచ్చు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad