Nara Lokesh Key Comments on Movies: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఆదివారం ఒక కీలక ప్రకటన చేశారు. ‘ఎక్స్’ వేదికగా ఆయన చేసిన పోస్ట్ లో.. సినీ, టెలివిజన్ రంగాల్లో మహిళల పట్ల కొనసాగుతోన్న వివక్షను తప్పుపట్టారు. సామాజిక స్పృహ కలిగిన నాగరిక సమాజాన్ని నిర్మించాలంటే, మహిళల పట్ల గౌరవభావం ఉండటం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. సినిమాలు, సీరియళ్లలోని సన్నివేశాలు, డైలాగ్స్ లో అసభ్యత, లింగ వివక్ష వంటి వాటిపై నియంత్రణ అవసరమని లోకేష్ అభిప్రాయపడ్డారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/ap-telangana-heavy-rains-imd-alert-next-4-days/
పిల్లలు వీక్షించే విధంగా చిత్రాలు, సీరియళ్లను రూపొందించాలని.. అందులో చూపించే కథలు, పాత్రలు, సంభాషణలు బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు. ఇంట్లో తెరపై చూసేదే వారు నేర్చుకునే అవకాశముందని వివరించారు.లింగ వివక్ష, అవమానకరమైన సంభాషణలను నియంత్రించాలన్నారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే అంశాలపై కట్టడి చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన స్పష్టం చేశారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/pawan-kalyan-speech-independence-day/


