Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్AP ministers portfolios: పవన్ కు పంచాయతీ, లోకేశ్ కు ఐటీ, అనితకు హోం...

AP ministers portfolios: పవన్ కు పంచాయతీ, లోకేశ్ కు ఐటీ, అనితకు హోం శాఖ పదవులు

ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్

ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. కాగా సాధార‌ణ ప‌రిపాల‌న‌, శాంతి భ‌ద్ర‌త‌ల శాఖలను సీఎం చంద్రబాబు తనవద్దే ఉంచుకున్నారు. నంబర్ టూ -డిప్యుటీ సీఎం అయిన ప‌వ‌న్ కల్యాణ్ కు పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, తాగునీటి స‌ర‌ఫ‌రా, పర్యావ‌ర‌ణ‌, అట‌వీ, సైన్స్ అండ్ టెక్నాల‌జీ శాఖలను కేటాయించారు.

- Advertisement -

ఇక తన కుమారుడైన లోకేశ్ కు మాన‌వ వ‌న‌రులు, ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్స్, ఆర్టీజీని చంద్రబాబు కేటాయించటం విశేషం.

అనితకు రాష్ట్ర హోంశాఖ మంత్రి పదవి దక్కటం విశేషం. గత సర్కారులోలానే ఈ సర్కారులోనూ కీలకమైన హోంశాఖను మహిళా నేతకు కేటాయించారు.

. కింజార‌పు అచ్చెన్నాయుడు – వ్య‌వ‌సాయం, ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ‌, పాడి ప‌రిశ్ర‌మ అభివృద్ధి, మ‌త్స్య‌శాఖ‌
కొల్లు ర‌వీంద్ర – గ‌నులు, ఎక్సైజ్ శాఖ‌లు, నాదెండ్ల మ‌నోహ‌ర్ – పౌర స‌ర‌ఫ‌రాలు, పొంగూరు నారాయ‌ణ – మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్, ప‌ట్టణాభివృద్ధి, స‌త్య కుమార్ యాద‌వ్ – ఆరోగ్యం, కుటుంబ వైద్యారోగ్య శాఖ‌, నిమ్మ‌ల రామానాయుడు – వాట‌ర్ రిసోర్స్ డెవ‌ల‌ప్‌మెంట్, మ‌హ్మ‌ద్ ఫ‌రూఖ్ – లా అండ్ జ‌స్టిస్, మైనార్టీ వెల్ఫేర్, ఆనం రాంనారాయ‌ణ రెడ్డి – దేవాదాయ శాఖ‌, ప‌య్యావుల కేశవ్ – ఆర్థిక శాఖ‌, క‌మ‌ర్షియ‌ల్ ట్యాక్సెస్, లెజిస్లేటివ్, అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ – రెవెన్యూ, కొలుసు పార్థ‌సార‌థి – హౌసింగ్, ఐ అండ్ పీఆర్ శాఖలు దక్కాయి.

వీరాంజ‌నేయ స్వామి – సోష‌ల్ వెల్ఫేర్, గొట్టిపాటి ర‌వికుమార్ – ఎన‌ర్జీ, కందుల దుర్గేశ్ – టూరిజం, క‌ల్చ‌ర్, సినిమాటోగ్ర‌ఫీ, గుమ్మ‌డి సంధ్యారాణి – మ‌హిళా – శిశు సంక్షేమ అభివృద్ది శాఖ‌, ట్రైబ‌ల్ వెల్ఫేర్, బీసీ జ‌నార్థ‌న్ రెడ్డి – రోడ్లు, భ‌వ‌నాలు, టీజీ భ‌ర‌త్ – ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎస్ స‌విత – బీసీ వెల్ఫేర్, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్ టైల్స్, వాసంశెట్టి సుభాష్ – కార్మిక శాఖ‌, కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ – ఎంఎస్ఎంఈ, సెర్ప్, మండిప‌ల్లి రామ్ ప్ర‌సాద్ రెడ్డి – ర‌వాణా, యూత్ అండ్ స్పోర్ట్స్ శాఖలను కేటాయించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News