Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: ఆంధ్రప్రదేశ్ అంతా విస్తరించిన నైరుతి

AP: ఆంధ్రప్రదేశ్ అంతా విస్తరించిన నైరుతి

విస్తరించిన రుతుపవనాలు

వేడితో మాడిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎట్టకేలకు గుడ్ న్యూస్. ఈ రోజు (22-06-2023) నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తరించినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డా.బిఆర్ అంబేద్కర్ తెలిపారు.

- Advertisement -

ఐఎండి సమాచారం ప్రకారం గురువారం నాటికి నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తరించినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డా.బిఆర్ అంబేద్కర్ తెలిపారు. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతుందన్నారు.

నైరుతి రుతుపవనాల ప్రభావంతో రేపు రాష్ట్రంలో అక్కడక్కడ భారీవర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి జల్లులు, ఎల్లుండి అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.

• రేపు పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

• శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అనంతపురం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు పడే అవకాశం ఉంది.

• ఎల్లుండి అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

• శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు పడే అవకాశం ఉంది.

గురువారం సాయంత్రం 6 గంటల వరకు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 108 మి.మీ, పల్నాడు జిల్లా దులిపల్లలో 62 మి.మీ, సత్తెనపల్లిలో 62 మి.మీ, చాగల్లులో 59.5 మి.మీ, ముప్పాళ్ళలో 46 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వివరించారు. భారీ వర్షాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, పొలాల్లో పనిచేసే కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News