Saturday, April 12, 2025
Homeఆంధ్రప్రదేశ్AP: జగన్ కు థాంక్స్ చెప్పిన నాయీ బ్రాహ్మణులు

AP: జగన్ కు థాంక్స్ చెప్పిన నాయీ బ్రాహ్మణులు

సచివాలయం వద్ద ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సిద్దవటం యానాదయ్య, డైరెక్టర్‌లు, నాయీ బ్రాహ్మణ (కేశ ఖండనశాల) జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గుంటుపల్లి రామదాసు, జేఏసీ సభ్యులు. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల ట్రస్టు బోర్డు సభ్యుల నియామకాల్లో  నాయీ బ్రాహ్మణులకు అవకాశం కల్పిస్తూ ఇటీవల ఏపీ క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది, దీంతో పాటు కేశ ఖండన శాలల్లో విధులు నిర్వహించే నాయీ బ్రాహ్మణులకు నెలకు కనీసం రూ. 20,000 ఆదాయాన్ని వర్తింపజేస్తూ ఇటీవల ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేసింది.

- Advertisement -

వెనుకబడిన కులాలు సమాజానికి వెన్నెముకలని నిరూపిస్తూ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ తమ సామాజిక వర్గానికి న్యాయం చేశారని, త్వరలో నాయీ బ్రాహ్మణ కృతజ్ఞతా సభ నిర్వహించనున్నట్లు తెలిపారు నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్, డైరెక్టర్‌లు, ఇతర జేఏసీ నేతలు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News