Saturday, November 15, 2025
HomeTop StoriesAP New Districts Finalised 2025: ఏపీలో కొత్త జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు ఇవే

AP New Districts Finalised 2025: ఏపీలో కొత్త జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు ఇవే

AP New Districts Finalised 2025: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి జిల్లాల పునర్విభజన జరుగుతోంది. కొత్తగా రెండు జిల్లాలు ఖరారయ్యాయి. ఏడు రెవిన్యూ డివిజన్లను కొత్తగా ఏర్పర్చనున్నారు. మంత్రివర్గ ఉపసంఘం దీనిపై దాదాపుగా నిర్ణయం తీసుకుంది. ఏపీ కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చు. కొత్తగా ఏర్పడనున్న జిల్లాలేవో తెలుసుకుందాం.

- Advertisement -

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా చేసే క్రమంలో మొత్తం 25 జిల్లాలు ఏర్పాటు చేయదల్చింది. అరకు పార్లమెంట్ పరిధిలో భౌగోళికంగా పెద్దదిగా ఉండటంతో పార్వతీపురం మన్యం పేరుతో మరో జిల్లా అదనంగా చేర్చింది. ఇలా మొత్తం 26 జిల్లాలు ఏర్పారు చేసింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత అదనంగా కొన్ని జిల్లాలు, రెవిన్యూ జిల్లాల ఏర్పాటుతో పాటు కొన్ని మండలాలు, నియోజకవర్గాలను ఇతర జిల్లాల్లో కలపాలనే ప్రతిపాదన వచ్చింది. ఆ దిశగా అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, మార్పులు చేర్పులతో పాటు కొత్త రెవిన్యూ డివిజన్ల ఏర్పాటుపై అధ్యయనం చేసింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం కొన్ని ప్రతిపాదనలు ఫైనల్ చేసింది. కొత్తగా రెండు జిల్లాలు, ఏడు రెవిన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.

కొత్త జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు ఇవే

ఏపీలో కొత్తగా చిత్తూరు నుంచి మదనపల్లి, ప్రకాశం నుంచి మార్కాపురం జిల్లాలు ఏర్పడనున్నాయి. మదనపల్లి జిల్లాలో పీలేరు, మదనపల్లి రెవిన్యూ డివిజన్లు ఉంటాయి. ఈ జిల్లాలో మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు అసెంబ్లీ నియోజకవర్గాలు వచ్చేలా ప్రతిపాదన సిద్ధమైంది. పలమనేరు నియోజకవర్గంలోని 6 మండలాలు, చిత్తూరు డివిజన్‌లోని కొన్ని మండలాలతో మదనపల్లె జిల్లా ఏర్పాటు కానుంది. ఇక కొత్తగా మడకశిర, బనగానపల్లె, పీలేరు, గిద్దలూరు, నక్కపల్లి, అద్దంకి, అవనిగడ్డలు రెవిన్యూ డివిజన్లుగా ఏర్పడనున్నాయి. ఇక కనిగిరి, మార్గాపురం, గిద్దలూరు డివిజన్లతో కలిపి మార్కాపురం జిల్లా ఏర్పాటు కానుంది.

మార్పులు చేర్పులు ఇవే

ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒకే రెవిన్యూ డివిజన్ పరిధిలో ఉండేలా చేస్తున్నారు. నగరి డివిజన్‌ను తిరుపతి జిల్లా పరిధిలో తీసుకొస్తారు. ఇక గన్నవరం, నూజివీడు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలపనున్నారు. కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలపవచ్చు. ఈనెల 10వ తేదీన జరగనున్న ఏపీ కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad