Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్AP News: దోశ ముక్క గొంతులో ఇరుక్కుపోయి 2 ఏళ్ల బాలుడు మృతి

AP News: దోశ ముక్క గొంతులో ఇరుక్కుపోయి 2 ఏళ్ల బాలుడు మృతి

Andhra Pradesh News: అనంతపురం జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. టిఫిన్ తినే సమయంలో దోశ ముక్క గొంతులో ఇరుక్కుపోయి ఓ బాలుడు మృతి చెందాడు. దోశ ముక్క గొంతులో ఉండిపోవడం వల్ల ఊపిరాడక ఆ చిన్నారి ప్రాణాలు విడిచాడు. అనంతపురంలోని తపోవనంలో అభిషేక్, అంజనమ్మ దంపతుల నివాసం ఉంటున్నారు. వీరికి విశాల్ అనే కుమారుడు ఉన్నాడు. ఆ బాలుడే దోశ తింటూ  మృత్యువాత పడ్డాడు.

విశాల్ తల్లిదండ్రులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం అంజనమ్మ తన కుమారుడి కోసం దోశ తెచ్చింది. తినిపించే క్రమంలో ఆ బాలుడి గొంతుకు అడ్డంగా దోశ ముక్క ఉండిపోయింది. ఆ సమయంలో బాలుడు ఊపిరాడక కిందపడిపోయి నరకయాతన అనుభవించాడు. హుటాహుటిన ఆ బాలుడ్ని ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

అయితే, బాలుడు చికిత్స పొందుతూ మరణించాడు. కళ్లముందే కొడుకు మరణం చూసి తల్లీదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. పిల్లాడి ఆకలి తీర్చడానికి తెచ్చిన దోశ.. బాలుడి ప్రాణం తీస్తుందని ఊహించలేదని ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. ఈ ఘటన స్థానికులను కలచిపోసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad