Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: యథేచ్చగా పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా

AP: యథేచ్చగా పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా

ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పేదల బియ్యాన్ని అక్రమార్కులు పక్కదారి పట్టిస్తూ బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారు. హోలగుండ మండలంలోని ఇంగాల్డహల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చుట్టుపక్కల గ్రామాలనుంచి వేల క్వింటల రేషన్ బియ్యాన్ని సేకరించి, ఆ గ్రామంలోనే నిల్వ ఉంచి, రాత్రిళ్ళు యాదేచ్చగా బ్లాక్ మార్కెట్కు తరలిస్తు లక్షల రూపాయలను ఆర్జిస్తున్నారు.

- Advertisement -

• రేషన్ బియ్యం దందా కొనసాగింపు

ఓ డీలర్ తన రేషన్ షాపు లోనే కార్డు దారుల వేలిముద్రలు వేయించుకొని నేరుగా డబ్బులు ఇస్తూన్నట్లు సమాచారం. అలాగే కొందరు దళారులు ముఠాగా ఏర్పడి ఇంటింటికి తిరిగి కార్డుదారుల వద్ద బియ్యం ఎనిమిది రూపాయలకు కిలో బియ్యం కొనుగోలు చేసి బియ్యాన్ని సరిహద్దు కర్ణాటకలోని సిరుగుంప్ప, సిందనూర్, మాన్వి లాంటి పట్టణ లకు కిలో 20 రూపాయలకు వేల క్వింటాళ్ల బియన్ని తరలిస్తూ లక్షల రూపాయలు లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు.

గతంలో ఆ డీలర్ వద్ద పోలీసుల ఆకస్మిక తనిఖీలో సుమారు 200 క్వింటల్ రేషన్ బియ్యం పట్టుబడింది. కేసు నమోదు చేసిన సదరు డీలర్ యదేచ్చగా రేషన్ బియాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీనిపై జిల్లా అధికారులు స్పందించి అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై తహశీల్దార్ హుస్సేన్ సాబ్ ను వివరణ కోరగా అక్రమంగా రేషన్ బియ్యం తరలించే వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News