Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: అసెంబ్లీలో స్మార్ట్ మీటర్లపై పెద్దిరెడ్డి

AP: అసెంబ్లీలో స్మార్ట్ మీటర్లపై పెద్దిరెడ్డి

వ్యవసాయంకు పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. స్మార్ట్ మీటర్ల ద్వారా రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని, వ్యవసాయ కనెక్షన్ లకు వినియోగించే విద్యుత్ బిల్లులు డిబిటి ద్వారా చెల్లింపు చేయచ్చని ఆయన భరోసా ఇచ్చారు. స్మార్ట్ మీటర్లపై తెలుగుదేశం, కమ్మూనిస్ట్ ల తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్న ఆయన.. ఉచిత వ్యవసాయ కనెక్షన్ ల ద్వారా వాస్తవ విద్యుత్ వినియోగం తెలుస్తుందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ వల్ల 33 శాతం తక్కువ వినియోగం ఉన్నట్లు తేలిందన్నారు. కేంద్రప్రభుత్వం, కేంద్ర విద్యుత్ నియంత్రణ సంస్థల మార్గదర్శకాల ప్రకారమే స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నట్టు, స్మార్ట్ మీటర్ల టెండర్లు ఫైనాన్సియల్ బిడ్ ప్రాసెస్ లో ఉన్నాయని సభకు వివరించారు.

- Advertisement -

ఉచిత విద్యుత్ ఇస్తే తీగెలపై దుస్తులు ఆరేసుకోవాలని ఆనాడు చంద్రబాబు ఎద్దేవా చేశాడని, వ్యవసాయ దండుగ అని చంద్రబాబు అనలేదా? చంద్రబాబు హయాంలో ఎందరు రైతులు కరెంట్ షాక్, పాముకాటుతో చనిపోయారో లెక్కలు చెప్పాలంటూ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News