వర్షాలు లేక వేసిన పంటలు పండక బతుకు జీవుడా అంటూ పొట్టకూటి కోసం సుదూర ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. కర్నూలు జిల్లా పచ్చిమ ప్రాంతమైన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఇప్పటికే వేలాది మంది వ్యవసాయ కూలీలు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు వలస వెళ్లారు. గురువారం రాత్రి ఎమ్మిగనూరు పట్టణం ఎంజీ పెట్రోల్ బంక్ లో ఓ బొలోరో వాహనం పిల్ల పాపలతో మూట ముళ్ళ సర్దుకొని జీవనోపాధి కోసం తెలంగాణ రాష్ట్ర మహబూబ్ నగర్ జిల్లా చింతకుంటకు పత్తి తీయడానికి వలస వెళ్లారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలం బైలుప్పల గ్రామానికి చెందిన దాదాపు 22 మంది వ్యవసాయ కూలీలు ఇళ్ళకు తాళాలు వేసుకొని పత్తి పంటల పనులకు వెళ్లారు. వీరితో వారి పిల్లలను కూడా వెంట తీసుకెళ్లారు. ఇందులో కొంతమంది స్కూల్ కు వెళ్ళే విద్యార్థులు కూడా ఉన్నారు.
AP people migrating to Telangana: తెలంగాణకు వలస వస్తున్న ఏపీ వాసులు
కరువుతో అల్లాడుతూ, పొట్ట చేత పట్టుకుని..
సంబంధిత వార్తలు | RELATED ARTICLES