Homeఆంధ్రప్రదేశ్AP PGECET 2026: ఏపీ పీజీఈసెట్‌ ఫలితాలు విడుదల.. 93.29 శాతం ఉత్తీర్ణత

AP PGECET 2026: ఏపీ పీజీఈసెట్‌ ఫలితాలు విడుదల.. 93.29 శాతం ఉత్తీర్ణత

AP PGECET 2026: ఏపీ పీజీఈసెట్‌(AP PGECET-2026) ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ‘ఎక్స్‌’ వేదికగా ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. ఏప్రిల్‌ 28, 29, 30 తేదీల్లో ఈ పరీక్షలు జరగ్గా.. మొత్తం 9,990 మంది హాజరయ్యారు. 9,320 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తం 93.29 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/ap-cabinet-meeting-key-resolutions-on-electric-and-petrol-save/

ఈ ఫలితాల ఆధారంగా రాష్ట్రంలోని పీజీ కళాశాలల్లో ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా-డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ పీజీఈసెట్‌ నిర్వహిస్తారు. అభ్యర్థులు APSCHE అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ మార్కులు, ర్యాంకులను తెలుసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News