Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్AP Police: పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల

AP Police: పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల

AP Police Constable Final Results Released : ఏపీలో పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదలయ్యాయి. మంగళగిరిలోని డీజీపీ ఆఫీసులో హోంమంత్రి అనిత వీటిని విడుదల చేశారు. ఫలితాలను https://slprb. ap.gov.in/ వెబ్సైట్లో చూసుకోవచ్చు.

- Advertisement -

ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలంటే?
అభ్యర్థులు https://slprb.ap.gov.in/ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
హోం పేజీలో సెలక్షన్ లిస్టులకు సంబంధించిన ఆప్షన్లు ఉంటాయి.
ఇందులో సివిల్, ఏపీఎస్పీ వంటి ఇచ్ఛికలు కనిపిస్తాయి.
వీటిని క్లిక్ చేస్తే ఎంపికైన వారి వివరాలతో కూడిన పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది.
ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి ఈ వివరాలను కాపీని పొందవచ్చు.రెండేళ్లకుపైగా నియామక ప్రక్రియ..

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/ys-jagan-nellore-visit-three-cases-filed-against-ysrcp-leaders/

2023లో ఏపీ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు 4,59,182 మంది అభ్యర్థులు హాజరవ్వగా.. ఇందులో 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరికి 2024 డిసెంబరులో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో 38,910 మంది క్వాలిఫై అయ్యారు. ఇక మెయిన్స్ పరీక్షలకు మొత్తం 37,600 మంది హాజరుకాగా….. వారిలో 33,921 మంది అర్హత సాధించారు.

Also Read: https://teluguprabha.net/ap-district-news/amaravati/high-court-grants-relief-to-ysrcp-mlc-anantha-babu-in-driver-subrahmanyam-murder-case/

మొత్తంగా ఈ కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ ప్రక్రియ మొదలై రెండేళ్లకుపైగానే అయింది. పలు కారణాల రీత్యా వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీస్ శాఖలో దిగువ స్థాయి సిబ్బంది కొరత తీవ్రంగా ఉండటం వల్ల… పోలీస్ రిక్రూట్‌మెంట్‌పై దృష్టి సారించింది కూటమి ప్రభుత్వం. నియామక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు.. తాజాగా తుది ఫలితాలను విడుదల చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad