Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Job Notification : ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. 6,500 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

Job Notification : ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. 6,500 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

ఏపీలో ఉన్న నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి సీఎం జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలోని 6,511 పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టనున్నట్లు ప్రకటించారు. పోస్టుల భర్తీ ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనున్నట్లు అధికారవర్గాల సమాచారం.

- Advertisement -

పోలీసు పోస్టుల భర్తీకి డిసెంబర్ లో దరఖాస్తుల స్వీకరణ, వచ్చే ఏడాదిలో రాతపరీక్ష, ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. 387 సివిల్ ఎస్సై పోస్టులు, 96 ఏపీఎస్పీ ఎస్సై పోస్టులు, 3508 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు, 2520 ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎస్‌ఐ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. కానిస్టేబుల్‌ పోస్టులకు ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పూర్తి వివరాలకై https://psc.ap.gov.in/ వెబ్‌సైట్‌ లో చూడవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad