Colleges Bandh: ఏపీలో కాలేజీలు బంద్ కానున్నాయి. తమ సమస్యలు పరిష్కారం చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రైవేటు డిగ్రీ కాలేజీ యాజమాన్యాల సంఘం ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చింది. ఇంటర్ ఫలితాలు వెల్లడై రెండు నెలల దాటినా ఇంతవరకు ప్రైవేట్ కాలేజీల్లో ఆడ్మిషన్లు ప్రక్రియ ప్రారంభించలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
డిగ్రీ విద్యలో నెలకొన్న సమస్యలపై ఈ ఏడాది ఫిబ్రవరిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో అసోసియేషన్ సభ్యులు చర్చలు జరిపారని.. కానీ ఇంతరవకు సమస్యల పరిష్కారం కాలేదని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. సమస్యల పరిష్కరంలో అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. అధికారుల తీరుతో కాలేజీల నిర్వహణలో తీవ్ర ఇబ్బందులు ఎదురువుతున్నాయని వెల్లడించారు. ప్రొఫెసర్ వెంకయ్య కమిటీ సిఫార్సుల మేరకు డ్యూయల్ మేజర్ డిగ్రీ అమలు చేయాలని కోరుతున్నారు. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కూడా కల్పించామన్నారు. కానీ ఇప్పుడేమో ప్రభుత్వం సింగిల్ మేజర్ విధానం తీసుకురావాలని నిర్ణయించండతో పరిస్థితి గందరగోళంగా మారిందని వాపోతున్నారు.
Also Read: తిరుమల వెళ్లే వాళ్లకి అలర్ట్.. ఈ తేదీల్లో ఆర్జిత సేవలు రద్దు
ప్రభుత్వం తక్షణమే డిగ్రీ ఆడ్మిషన్ల షెడ్యూల్ ప్రకటించాలని.. పెండింగ్‌లో ఫీజుల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో తమ నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు విద్యార్థి సంఘాలు కూడా ఈనెల 17న ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద ధర్నా చేపడతామని తెలిపాయి. మొత్తానికి ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్యం అసోసియేషన్ పిలుపు మేరకు ఈనెల 21న రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలు మూతపడనున్నాయి. మరి ఈ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందో లేదో వేచి చూడాలి.


