Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్AP Rains: ఏపీలో భారీ వర్షాలు..రాబోయే 3 రోజులు దంచుడే దంచుడు!!

AP Rains: ఏపీలో భారీ వర్షాలు..రాబోయే 3 రోజులు దంచుడే దంచుడు!!

AP Rains Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే మూడు రోజులపాటు విస్తారంగా వ‌ర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అమ‌రావ‌తి వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. ఈదురు గాలుల‌తో పాటు పిడుగుల‌ు పడే అవకాశం కూడా ఉన్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ ఎండీ ప్ర‌ఖ‌ర్ జైన్ ప్రకటించారు.

నేడు అనగా శనివారం (జులై 19) శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు (మన్యం), గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, అనంతపురం, నంద్యాల, వైఎస్ఆర్ క‌డ‌ప‌, అన్న‌మ‌య్య‌, తిరుప‌తి, చిత్తూరు జిల్లాల్లో ఓ స్థాయి నుంచి భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావరణ శాఖ వెల్లడించింది.

- Advertisement -

రేపు (ఆదివారం) అనగా జులై 20 తేదీన గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, కృష్ణా, పల్నాడు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, ఏలూరు, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే శుక్రవారం నుంచి వర్షాలు ప్రారంభం అయ్యాయి. ప్ర‌కాశం, కృష్ణా, ఏలూరు, ప‌ల్నాడు, అల్లూరి సీతారామ‌రాజు, అన‌కాప‌ల్లి, డా.బీఆర్ అంబేద్క‌ర్ కోన‌సీమ త‌దిత‌ర జిల్లాలో తేలిక‌పాటి వర్షాలు కురిశాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad