Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్AP rains: బంగాళాఖాతంలో ద్రోణి

AP rains: బంగాళాఖాతంలో ద్రోణి

తేలికపాటి వర్షాలు

కోస్తాంధ్ర & ఆనుకొని ఉన్న తెలంగాణ మీదుగా తక్కువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. తెలంగాణ నుండి బంగాళాఖాతం మధ్య ప్రాంతాల వరకు ద్రోణి కొనసాగుతుందని తెలిపారు.

- Advertisement -

దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, వైయస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

ఎల్లుండి విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News