Sunday, June 23, 2024
Homeఆంధ్రప్రదేశ్AP rains: 5 రోజులు వానలే

AP rains: 5 రోజులు వానలే

కొనసాగుతున్న ద్రోణి

రాయలసీమ నుండి పశ్చిమమధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 3.1-5.8 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో రాబోయే 5 రోజులలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

- Advertisement -

రేపు అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఎల్లుండి అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

శనివారం సాయంత్రం 6 గంటల నాటికి విజయనగరం జిల్లా దత్తిరాజేరులో 78.5మిమీ, బాడంగిలో 60.2మిమీ,కాకినాడ జిల్లా శంఖవరంలో 51.7మిమీ, విజయనగరం నెల్లిమర్లలో 37.5, చీపురుపల్లిలో 37మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News