ఎ.పి. సెక్రటేరియట్లో పనిచేస్తున్న ఎస్.పి.ఎఫ్. సిబ్బంది – అధికారులకు ఎస్.పి.ఎఫ్ ఆఫీస్ ఆవరణలో విజయవాడ రమేష్ హాస్పిటల్ వారి ఆధ్వర్యములో ఉచిత వైద్య శిబిరం నిర్వహిoచారు. ఎస్. పి. ఎఫ్. డి.జి. హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు మేరకు ఎస్.పి.ఎఫ్. డి.ఐ.జి. బి.వి.రామి రెడ్డి సలహాల మేరకు కమాండెంట్ Dr. కె.ఎన్.రావు ఆధ్వర్యములో ఈ వైద్య శిబిరము జరిగిందని చీఫ్ సెక్యూరిటీ అధికారి కె.కృష్ణమూర్తి తెలిపారు. ఈ వైద్య శిబిరములో 222 ఎస్.పి.ఎఫ్. అధికారులు, సిబ్బందికి గుండె, షుగర్, బి.పి. ఇతర వైద్య పరీక్షలు నిర్వహిoచారు. ఇందులో భాగంగా ఇ.సి.జి. పరీక్ష నిర్వహిoచారు. అంతకు ముందు సిబ్బందిని ఉద్దేశించి ఆర్యోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు, సలహాలను రమేష్ హాస్పిటల్ డాక్టర్స్ అయిన Dr. అబ్దుల్ ఖలీద్, కార్దియలజిస్ట్ Dr. శామ్యూల్ మార్క్ ఫిజిషియన్ సూచిoచారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సెక్యూరిటీ అధికారి కృష్ణమూర్తితో పాటు ఇన్స్పెక్టర్లు వి.ఎస్..నారాయణ, Dr. ఎ. సతీష్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్స్, సిబ్బంది పాల్గొన్నారు.
AP: ఎస్పీఎఫ్ పోలీసులకు వైద్య శిబిరం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES