Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: సృజనాత్మకత & సాంస్కృతిక సమితి బాధ్యతలు చేపట్టిన జోగి నాయుడు

AP: సృజనాత్మకత & సాంస్కృతిక సమితి బాధ్యతలు చేపట్టిన జోగి నాయుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక సమితి క్రియేటివ్ హెడ్ గా సినీ నటుడు, దర్శకుడు మరియు వ్యాఖ్యాత ఎల్. జోగినాయుడు బాధ్యతలు చేపట్టారు. వెలగపూడి ఆంధ్రప్రదేశ్ సచివాలయం నాల్గో బ్లాక్ లోని రాష్ట్ర యువజనాభివృద్ది, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.రజత్ భార్గవ చాంబరులో ప్రమాణ స్వీకారం చేసిరి ఆయన ఈ బాధ్యతలను చేపట్టారు.

- Advertisement -

రాష్ట్రంలో సాంస్కృతిక పురోగతి, తెలుగు భాషాభివృద్ది, పద్య, ఆధునిక నాటక వికాసం, జానపద కళారూపాల అభివృద్ది-ఆధునీకరణ తదితర కార్యక్రమాలను వ్యూహాత్మకంగా నిర్వహించేందుకై రాష్ట్ర సృజనాత్మక-సాంస్కృతిక సమితి క్రియేటివ్ హెడ్ గా ఎల్.జోగినాయుడును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News