మణిపూర్ విద్యార్ధుల విషయంలో ఫలించాయి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రయత్నాలు. రెండు ప్రత్యేక విమనాలు ఏర్పాటు చేసి.. వీటి ద్వారా ఏపీ విద్యార్థులను రాష్ట్రానికి సురక్షితంగా తరలించనున్నారు. ఇదంతా సొంత ఖర్చులతో ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. ఒక విమానం హైదరాబాద్‌కు, మరోక విమానం కోల్‌కత్తాకు, అక్కడినుంచి స్వస్ధలాలకు పంపేలా చర్యలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. రేపు ఉదయం 9.35 గంటలకు హైదరాబాద్ బయలుదేరనున్న విమానం, అందులో 108 మంది ఏపీ విద్యార్ధులు IMF HYD 0935/1235. 108 Andhra Pradesh.
రేపు ఉదయం 11.10 గంటలకు కోల్‌కత్తా బయలుదేరనున్న విమానం, అందులో 49 మంది ఏపీ విద్యార్ధులు IMF CCU 1110/1220. 49 Andhra Pradesh. మొత్తం ఆంధ్రప్రదేశ్ కు చెందిన 157 మంది విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం సురక్షితంగా తరలించనుంది.
మణిపూర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శాంతి భద్రతలు డీజీతో హోం మంత్రి తానేటి వనిత సమీక్షించారు. రాష్ట్ర విద్యార్ధులను త్వరితగతిన తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి వనిత. మణిపూర్ లో చదువుకునేందుకు వెళ్లిన విద్యార్థులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని హోం మంత్రి తానేటి వనిత వెల్లడించారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు ప్రత్యేక విమానాలను పంపి.. తెలుగు విద్యార్థులను రాష్ట్రానికి తరలించేందుకు చర్యలు చేపట్టినట్టు వివరించారు. విద్యార్థుల భద్రతపై ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు మణిపూర్ రాష్ట్ర పోలీసులతో సంప్రదింపులు జరుపుతోందని హోం మంత్రి తానేటి వనిత వెల్లడించారు.