మణిపూర్ లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను సురక్షితంగా తరలించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇంఫాల్ నుంచి 106 మంది విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తరలించారు. ప్రత్యేక విమానంలో, రవాణా భోజన ఖర్చులను రాష్ట్ర సర్కారే భరిస్తూ తీసుకువచ్చింది. ఇప్పటి వరకు 161 మంది విద్యార్థులను ప్రభుత్వం గుర్తించి, విడతలవారిగా వారిని తీసుకొచ్చి, ఎయిర్ పోర్టు నుంచి కార్లలో ఇంటికి చేర్చుతున్నారు.



