Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: సీఎం జగన్ తో స్వామి నారాయణ్ గురుకుల్ ట్రస్ట్ సభ్యుల భేటీ

AP: సీఎం జగన్ తో స్వామి నారాయణ్ గురుకుల్ ట్రస్ట్ సభ్యుల భేటీ

తిరుపతి, పులివెందుల, విశాఖల్లో గురుకుల్స్

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌ సభ్యులు, ప్రతినిధులు భేటీ అయ్యారు. ఏపీలో విశాఖపట్నం, తిరుపతి, పులివెందులలో ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే సంసిద్దత వ్యక్తం చేసిన శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌ సభ్యులు, ప్రతినిధులు, వచ్చే నెలలో తిరుపతి స్కూల్‌ శంకుస్ధాపనకు హాజరవ్వాలని సీఎంను కోరారు ట్రస్ట్‌ సభ్యులు. ఇందుకు సీఎం అంగీకరించారు. సీఎంతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ట్రస్టీ మెంబర్‌ సుఖ్‌వల్లభ్‌ స్వామి ఏమన్నారంటే…

- Advertisement -

శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ గ్రూప్‌కి ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్‌గడ్, రాజస్ధాన్, న్యూఢిల్లీ, యూఎస్‌ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియాలలో 52 కు పైగా విద్యాసంస్ధలు, 40 వేల మందికి పైగా విద్యార్ధులు ఈ గురుకులాల్లో విద్యనభ్యసిస్తున్నారు. తమ విద్యాసంస్ధల ఏర్పాటుకు మూడు ప్రాంతాల్లో ఏపీ ప్రభుత్వం భూములు కేటాయించడంతో సీఎంగారికి కృతజ్ఞతలు తెలియజేశాం. తిరుపతి స్కూల్‌ శంకుస్ధాపన తర్వాత అతి త్వరలోనే పులివెందుల, విశాఖ స్కూల్స్‌కు కూడా భూమి పూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ స్కూల్స్‌ ఏర్పాటు చేయడం ద్వారా ఆధునిక విద్యతో పాటు విలువలతో కూడిన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను నేటి తరానికి భోదించడమే తమ లక్ష్యమని, ఆ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.

ఈ సమావేశంలో పాల్గొన్న ట్రస్టీ మెంబర్‌ సుఖ్‌వల్లభ్‌ స్వామి, ధర్మ్‌సాగర్‌ స్వామి, మాజీ మంత్రి జలగం ప్రసాదరావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News