Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్TDP: టీడీపీలో విషాదం.. పల్లా శ్రీనివాస్ తండ్రి కన్నుమూత

TDP: టీడీపీలో విషాదం.. పల్లా శ్రీనివాస్ తండ్రి కన్నుమూత

తెలుగుదేశం పార్టీలో విషాదం చోటుచేసుకుంది. పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తండ్రి, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం(93) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

పల్లా సింహాచలం(Palla Simhachalam) మృతి పట్ల పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సింహాచలం నియోజకవర్గ అభివృద్ధి ఎనలేని కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు మంత్రులు కూడా సింహాచలం మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా 1989 నుంచి ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నారు. 1994లో సింహాచలం ఎమ్మెల్యేగా పార్టీ నుంచి గెలుపొందారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad