Srikakulam teacher video viral: ఉపాధ్యాయ వృత్తి అనేది నైతిక విలువలతో కూడుకున్న ఉద్యోగం. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో ఉన్నతులుగా తీర్చిదిద్దాల్సిన వృత్తి. కానీ ఇటీవల కొందరు ఉపాధ్యాయులు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. గురువు వృత్తికే కళంకం తెస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే: పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి కొంతమంది టీచర్లు అనైతిక చర్యలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల తరచూ చుస్తున్నాం. విద్యార్థులను కంటికిరెప్పలా కాపాడాల్సిన టీచర్స్.. పిల్లలతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే శ్రీకాకుళం జిల్లాలోని మెళియాపుట్టి మండల పరిధిలో చోటుచేసుకుంది. బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో.. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ టీచర్ దర్జాగా కూర్చీలో కూర్చొని సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తుంది. అంతే కాదండోయ్.. ఏకంగా పిల్లలతో కాళ్లు నొక్కించుకుంటూ విద్యార్థులపై తన జులూం ప్రదర్శించింది.
Teacher viral video: టీచరమ్మా.. ఇదేమి బుద్ధి..#teacher #student #srikakulam #viralvideo #LatestNews https://t.co/qy3IZ2vYnU pic.twitter.com/k1GFfpvkqO
— Telugu Prabha (@TeluguPrabha) November 4, 2025
Also Read:https://teluguprabha.net/crime-news/chevella-incident-including-mother-and-3-month-old-baby/
సోషల్ మీడియాలో తెగ వైరల్: అయితే ఈ అంశానికి సంబంధించిన మొత్తం తతంగాన్ని అక్కడే ఉన్న ఒకరు గమనించారు. వెంటనే వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు పిల్లలకు పాఠాలు చెప్పకుండా.. ఇదేం పని టీచరమ్మ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి టీచర్ల వల్లే .. నైతిక విలువలతో కూడుకున్న ఉపాధ్యాయ వృత్తికి కళంకం వస్తుందని అంటున్నారు. ఆ టీచర్‌పై వెంటనే ప్రభుత్వం చర్యలు తీలుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
టీచర్‌పై చర్యలకు విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్: బాలల హక్కులు పరిరక్షించాల్సిన టీచర్లే వారితో వెట్టిచాకిరీ చేయించడంపై పలు విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలతో కాళ్లు నొక్కించుకునేందుకు పాఠశాలకు వచ్చారా అని టీచర్‌ను ప్రశ్నిస్తున్నారు. కాళ్లు నొక్కిన పిల్లలకు వెంటనే టీచర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాలికలతో వెట్టి చాకిరీ చేయిస్తున్న ఉపాధ్యాయురాలిపై వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
రాజకీయం చేసే ప్రయత్నం: అయితే దీన్ని కొందరు నెటిజన్లు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు మరిన్ని చూడాల్సి వస్తుంది.. ఇది కేవలం టీజర్ మాత్రమేనని అంటున్నారు. అయితే మరికొందరు ఇంకోలా స్పందిస్తున్నారు. ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌కు ఈ అంశం తెలిస్తే అస్సలు ఉపేక్షించడని అంటున్నారు. అయితే ఈ అంశంపై కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.


