Tuesday, September 17, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: ప్రజల శ్రేయస్సుకు అధునాతన పరిజ్ఞానం

AP: ప్రజల శ్రేయస్సుకు అధునాతన పరిజ్ఞానం

ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని శుక్రవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (GHMC) ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ & డిజాస్టర్ మేనేజ్మేంట్ డైరెక్టర్ ఎన్ ప్రకాష్ రెడ్డి (IPS) సందర్శించారు. ఈ సందర్భంగా విపత్తుల సంస్థ అవలంబిస్తున్న అనేక సాంకేతికత పరిజ్ఞానాల గురించి మేనేజింగ్ డైరెక్టర్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ వివరించారు. స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ లో 24/7 వాతావరణాన్ని పర్యవేక్షించే విధానాన్ని తెలియజేసారు. తుపాన్లు, వరదలు, వడగాల్పులు, భారీవర్షాలు, పిడుగుపాటు హెచ్చరిక సమాచారాన్ని జిల్లా యంత్రాంగానికి, ప్రజలకు పంపించే వ్యవస్థను వివరించారు. వాతావరణ పరిశోధన విభాగాలలోని వివిధ అంశాలను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ డిజాస్టర్ మేనేజ్మేంట్ డైరెక్టర్ ఎన్ ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల శ్రేయస్సుకు అధునాతన పరిజ్ఞానాన్ని అమలు చేస్తున్న ఏపీ విపత్తుల నిర్వహణ సంస్ఖ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ గారిని ప్రత్యేకంగా అభినందించారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వినియోగిస్తున్న టేక్నాలజిను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ లో విపత్తు/అత్యవసర పరిస్థితులను సమర్ధవంతంగా నిర్వహించడానికి ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో అమలు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎగ్జిగ్యూటివ్ డైరెక్టర్ డా.సి.నాగరాజు, వాతావరణ నిపుణులు ఎం.ఎం అలీ, SEOC ఇంచార్జ్ సిహెచ్ శాంతిస్వరూప్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News