ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఏడవ రోజు సభలు ఉద్రిక్తత మధ్య ప్రారంభమయ్యాయి. కొషన్ అవర్ నుంచి టీడీపీ మెంబర్స్ స్పీకర్, ఇతర సభ్యులపట్ల అనుచితంగా ప్రవర్తించి, దాడికి పాల్పడ్డట్టు వైసీపీ ఆరోపిస్తోంది. స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ సభ్యులు దాడికి పాల్పడి.. గందరగోళానికి దారితీసినట్టు అధికార పక్షం భగ్గుమంది.
సభ ప్రారంభం కాగానే స్పీకర్ తో వాగ్వాదానికి దిగిన టీడీపీ సభ్యులు, స్పీకర్ వెల్ లోకి దూసుకుపోయి, ఆయన ముఖానికి ప్లక్కార్డులు అడ్డుపెట్టి, చివరికి దాడి చేసినట్టు వైసీపీ వెల్లడించింది. స్పీకర్ పై దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసిన వైసీపీ ఎమ్మెల్యేపై కూడా టీడీపీ సభ్యులు దాడి చేసినట్టు సర్కారు ఆరోపించింది.
స్పీకర్ మీదకి దాడి చేయటానికి ప్రయత్నించి, టీడీపీ ఎమ్మెల్యే డోలా వీరాంజనేయస్వామి స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి, ఆయన్ను చేతితో పొడవటం, దౌర్జన్యం చేసి స్పీకర్ ను అమానించడం జరిగినట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎలీజా వివరిస్తున్నారు. దాన్ని చూసి నేను స్పీకర్ పోడియం వద్దకు వెళితే.. టీడీపీ ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి, తన చేతిని పట్టుకుని తనను కూడా తోసేసినట్టు ఎలీజా వివరించారు. అప్పుడే ఎమ్మెల్యే సుధాకర్ బాబు తనను కిందకు లాగినట్టు ఎలీజా మీడియాకు వివరించటం వివాదాస్పదం అవుతోంది. సుధాకర్ బాబు మీద కూడా టీడీపీ సభ్యుడు దాడి చేసినట్టు..టీడీపీ సభ్యుల దాడిలో గాయపడిన వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే సుధాకర్ కూడా మీడియాకు జరిగినదాన్ని వివరించారు. శాసనసభలో గొడవకు చంద్రబాబే కారణమన్న సుధాకర్ బాబు.. టీడీపీ ఎమ్మెల్యేలతో తమపై చంద్రబాబు దాడి చేయించారని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టాలని, తనపై టీడీపీ ఎమ్మెల్యే డోలా వీరాంజనేయస్వామి దాడి చేశారన్న సుధాకర్ బాబు ఆరోపించారు.
టీడీపీ సభ్యులు అంతా నెడుతుంటే ఎమ్మెల్యే ఎలీజాని కాపాడటం కోసం పోడియం పైకి వెళ్తే.. తనను అగ్రవర్ణానికి చెందిన బెందాళం అశోక్ దారుణాతి దారుణంగా తిట్టి తోసేశారని… దాంతో తన చేతికి గాయమైందని దెబ్బ చూపించారు సుధాకర్ బాబు.