Wednesday, January 14, 2026
Homeఆంధ్రప్రదేశ్AP TET: ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల.. 

AP TET: ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల.. 

AP TET 2025 Results: ఆంధ్రప్రదేశ్‌లో టీచర్‌ ఎలిజబిలిటీ టెస్ట్‌(TET) ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 97,650 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులైనట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana-news/cm-revanth-reddy-on-krishna-river/

రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష- టెట్‌ 2025 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. గతేడాది డిసెంబర్‌ 10 నుంచి 21 వరకు టెట్‌ నిర్వహించారు. 2,71,692 మంది టెట్‌కు దరఖాస్తు చేసుకోగా 2,48,427 మంది హాజరయ్యారు. ఇప్పటికే ప్రాథమిక కీని విడుదల చేయగా.. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం తుది ఫలితాలను విడుదల చేసినట్లు ఏపీ టెట్‌ కన్వీనర్‌ వెంకట కృష్ణారెడ్డి వెల్లడించారు. 

Also Read: https://teluguprabha.net/technology-news/grok-chatbot-restricts-image-generation-feature-after-global-backlash/

మొత్తంగా టెట్‌- 2025లో 39.27 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు కన్వీనర్‌ పేర్కొన్నారు. ఈ పరీక్షకు 31, 886 మంది ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులు హాజరయ్యారని చెప్పారు. వారిలో 15,239 మంది ఉపాధ్యాయులు అర్హత సాధించారని తెలిపారు. అభ్యర్థులు టెట్‌ ఫలితాలను https://tet2dsc.apcfss.in/, https://cse.ap.gov.in/, అధికారిక వెబ్‌సైట్స్‌ ద్వారా తెలుసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News