Monday, December 9, 2024
Homeఆంధ్రప్రదేశ్AP TET Results: అలర్ట్.. టెట్ ఫలితాల విడుదల వాయిదా

AP TET Results: అలర్ట్.. టెట్ ఫలితాల విడుదల వాయిదా

AP TET Results| ఏపీ టెట్ పరీక్షా ఫలితాల విడుదల వాయిదా పడింది. తొలుత చెప్పిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ టెట్ ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఫలితాలు నవంబర్ 4వ తేదీకి వాయిదావేశారు అధికారులు. తుది కీలో జాప్యంతో పాటు ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ అమెరికా పర్యటనలో ఉండటంతో ఫలితాలు విడుదల వాయిదా పడినట్లు సమాచారం. సోమవారం లోకేష్ చేతుల మీదుగా ఫలితాలను విడుదల కానున్నాయి.

- Advertisement -

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్టోబర్‌ 3 నుంచి 21వ తేదీ వరకు విద్యాశాఖ టెట్ పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షలకు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 17 రోజులపాటు రెండు విడుతలుగా పరీక్షలు నిర్వహించారు. కాగా టెట్‌ స్కోర్‌కు లైఫ్ టైమ్ వాలిడిటీ ఉంటుంది. టీచర్ల నియామక పరీక్షలో దీనికి 20 శాతం వెయిటేజీ కూడా ఉండటంతో ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. జనరల్‌ అభ్యర్థులకు కనీసం 60 శాతం మార్కులు, బీసీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌/ ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది.

ఇక టెట్ ఫలితాలు విడుదలైన రెండు రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. మెగా డీఎస్సీ ద్వారా భారీగా పోస్టులు భర్తీచేసే యోచనలో ప్రభుత్వం ఉంది. మొత్తం ఖాళీల్లో ప్రిన్సిపల్- 52 పోస్టులు, స్కూల్‌ అసిస్టెంట్లు(SA)-7,725 పోస్టులు, సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (SGT)-6,371 పోస్టులు, ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(TGT)-1,781 పోస్టులు, పోస్ట్ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(PGT)-286 పోస్టులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET)-132 పోస్టులను భర్తీ చేయనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News