AP TET schedule released: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ఏపీ టెట్ – 2026 పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించారు. దీంతో పాటు ఉపాధ్యాయ అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై కూడా ఆయన కీలక అప్‌డేట్ ఇచ్చారు. టెట్ పరీక్షకు రేపటి (జూన్ 5) నుంచి జులై 5 వరకు అంటే నెల రోజుల పాటు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. జులై 25 నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 5 నుంచి ఆగస్టు 21 వరకు ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 15న తుది ఫలితాలు ప్రకటిస్తారు.
Also Read: Rajya Sabha seats: టీడీపీకి మూడు, జనసేనకు ఒకటి..! రాజ్యసభ స్థానాలపై కూటమిలో కుదిరిన సయోధ్య
అక్టోబర్‌లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్..
ఇక, టెట్ షెడ్యూల్‌తో పాటు ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. డీఎస్సీ పరీక్ష తేదీని సైతం మంత్రి నారా లోకేశ్ ఖరారు చేశారు. టెట్ ఫలితాలు విడుదలైన తర్వాత, అనగా 2026 అక్టోబరు నెలలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లుగా స్పష్టం చేశారు. డీఎస్సీ రాసే అభ్యర్థులకు టెట్ స్కోర్ ఎంతో కీలకం కావడంతో, అర్హులైన అభ్యర్థులందరికీ అవకాశం కల్పించేందుకు ముందస్తుగా టెట్ పరీక్షను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు.

