AP – TG | విభజన అంశాలపై చర్చలు జరిపేందుకు ఉభయ రాష్ట్రాల ఉన్నతాధికారులు సోమవారం ఏపీలో భేటీ అయ్యారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలపై చర్చించేందుకు ఏర్పాటైన వీరి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల (సీఎస్ ల) అధ్యక్షతన కమిటీ భేటీ అయింది.
పెండింగ్ లో ఉన్న వివిధ అంశాలపై సీఎస్ ల కమిటీ చర్చలు జరిపింది. విభజన చట్టంలోని 9,10 షెడ్యూలు సంస్థల ఆస్తుల పంపకాలపై చర్చించినట్లు తెలుస్తోంది. విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల పరస్పర మార్పిడి , వృత్తి పన్ను పంపకంపై అధికారుల కమిటీ చర్చలు జరపనున్నట్లు సమాచారం.
కాగా, ఈ భేటీలో తెలంగాణ (TG) నుంచి సీఎస్ శాంతి కుమారి, ఆర్థిక, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. ఇక ఏపీ (AP) నుంచి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఆర్థిక శాఖ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి, జెన్కో సీఎండీ, వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ హాజరయ్యారు.